తెలకపల్లి రవి: వాణీదేవిఎంపికతో ప్రచారాలభగ్నం.. ప్రొ.నాగేశ్వర్‌కు సంఘాల నుంచేమద్దతు

తెలకపల్లి రవి: వాణీదేవిఎంపికతో ప్రచారాలభగ్నం.. ప్రొ.నాగేశ్వర్‌కు సంఘాల నుంచేమద్దతు

తెలంగాణ ఎంఎల్‌సి ఎన్నికల్లో  ప్రధాన పార్టీలతో పాటు బలమైన ఇండిపెండెంట్లు, జర్నలిస్టులు తదితరులు రంగంలో నిబడటం ఆసక్తికలిగించే పరిణామం.  రెండునియోజకవర్గాల్లోనూ అయిదు లక్షలకు పైగా ఓటర్లు నమోదు కావడంతో రాజకీయ సమీకరణలు, ఓటింగు కూడా తీవ్రంగానే వుండటం తథ్యంగా కనిపిస్తుంది. ప్రాధాన్యత క్రమం కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది గనక ఆ విధమైన అవగాహనపైనా వూహాగానాలు ఆరోపణలు సాగుతున్నాయి. ఇప్పటి సిట్టింగ్ అభ్యర్థులే గాక ఆర్థిక వనరులు అధికార హంగుదర్పాలకు లోటులేని పల్లా రాజేశ్వరరెడ్డి, ఎన్‌.రామచంద్రరావు మళ్లీ రంగంలో నివడంతో  కేంద్రరాష్ట్ర పాలకపార్టీలకు పరీక్ష, ఇటీవల దుబ్బాక జిహెచ్‌ఎంసిలో మంచి ఫలితాలు సాధించిన బిజెపి వున్నసీటు కాపాడుకోలేకపోతే సాగర్‌ ఉప ఎన్నికల్లో ఎలాగూ గెలవదు గనక వూపు తగ్గిపోతుంది. గతంలో స్వతంత్రుడుగా  రెండు సార్లు బిజెపితో సహా అందరినీ ఓడించి ఘన విజయం సాధించిన ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ ఒక విరామం తర్వాత మళ్లీరంగంలోకి రావడంతో బిజెపి ఆశలకు పెద్ద ఆటంకమే. ఆయన టిఆర్‌ఎస్‌ తరపునే వున్నారనీ లోపాయి కారి ఒప్పందం వుందనీ పదేపదే ప్రచారం చేసిన బిజెపి ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాజీ ప్రధాని పివి కుమార్తె వాణీదేవిని పోటీకి పెట్టడంతో మాటమార్చవలసి వచ్చింది. అయితే అప్పటికీ ఆమెను తమ ఓట్లు చీల్చడానికే నిలబెట్టారని బలహీనమైన స్థానంలోనిలిపి పీవీని అవమానించారని కొత్త ప్రచారం తీసుకున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డిని పోటీకినిపిన కాంగ్రెస్‌ కూడా తమ ఓట్ల చీలికకే వాణిదేవిని తీసుకొచ్చారని ఆరోపించింది.

బ్రాహ్మణల ఓట్ల కోసమే వాణిని నిలిపారని వీరంటూంటే నమస్తే తెలంగాణలో ప్రచారమంతా బ్రాహ్మణ సంఘాల చుట్టూనే పరిభ్రమిస్తున్నది. ఈ వర్గా సమీకరణలో పేరున్న మాజీ ఎంఎల్‌సి కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఆర్‌ఎల్‌డి అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ఉపసంహరించుకుని మరోసారి బిజెపిలోకి నడిచారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ కూడా పోటీలో వున్నా ఆ పార్టీ ఇటీవలి పరాజయాల తర్వాత పెద్దగా ప్రాధాన్యత పొందడం లేదు. ఇందుకు భిన్నంగా నవ తెలంగాణ పత్రిక చూస్తే నాగేశ్వర్‌కు రోజూ డజన్ల సంఘాలు మద్దతు ప్రకటించడం కనిపిస్తుంది. ఆయన తమ కోసం పనిచేశారని గొంతునిచ్చారని వారంతా స్వానుభవాలు చెబుతున్నారు.  ఉద్యోగుల సంఘల నాయకుడైన దేవీప్రసాద్‌ గతంలో పోటీ చేసి ఓడిపోవడం తెలిసిన విషయమే. ఇంతవరకూ టిఆర్‌ఎస్‌ గెలవని హైదరాబాద్‌ రంగారెడ్డి మహబూబ్‌నగర్‌ స్థానాన్ని ఈసారి కూడా కోల్పోవలసి వస్తే ఆశ్చర్యం వుండదు, ఎందుకంటే ఉద్యోగుల పిఆర్‌సితో పాటు ఉపాధ్యాయులను వేరుచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందనే అసంతృప్తి తీవ్రంగానే వుంది. ప్రజలందరికీ పరిచితుడైన నాగేశ్వర్‌ ను మజ్లిస్‌ కాంగ్రెస్ ‌లెఫ్ట్ టిఆర్‌ఎస్‌ అర్బన్ ‌నగ్జల్స్‌ అభ్యర్థిగా బిజెపి చిత్రించడం విద్యాధికుల్లో విముఖత కలిగించింది, పైగా ఆ పార్టీలు స్వంతంగా అభ్యర్థులను పెట్టడంతో అసత్యమనీ తేలింది. నాగేశ్వర్‌ వ్యతిరేక ఓటు అనేక మంది మధ్య చీలిపోతున్నపరిస్థితుల్లో విస్తారమైన ఈ మద్దతును కాపాడుకోవడం ఆయనకు సానుకూల అంశంగా మారనుంది. 

ఖమ్మం నల్గొండ వరంగల్‌ మరోనియోజకవర్గం పల్లెలకు రాజకీయ పరీక్షగా వుంటుంది. మంత్రులతో సహా పాలకపార్టీ నేతలు ఆ భారం నెత్తిన వేసుకుని దిగాల్సిన పరిస్థితి. వామపక్షాలకు బలమైన ఓటింగువున్న ఈ జిల్లాలో ఉమ్మడి అభ్యర్థిగా విజయసారథి రెడ్డి నిబడ్డారు. ఇక్కడ మరోప్రొఫెసర్‌ కె.కోదండరామ్‌  తెలంగాణ సాధనలో సమన్వయపాత్ర వహించిన మేధావిగా రంగంలో దిగారు. ఎంఎల్‌ వర్గాలు కొన్నిబలపరుస్తున్నా రాజకీయంగా అప్పుడు ఆయన నాయకత్వం వహించిన జెఎసి వరవడి ఇప్పుడు లేదు. తను స్థాపించిన టిజెఎస్‌ రాజకీయ ప్రభావం చూపడంలో చాలాసార్లు విఫలమైంది. కనుక పెద్ద  ఫలితాన్ని ఆశించడానికి అవకాశముండదు. కాంగ్రెస్‌ రాములు నాయక్‌ గతంలో పదవులు నిర్వహించినవారే కాగా బిజెపి ప్రేమేందర్‌ రెడ్డిని ప్రతీకాత్మకంగా నిలిపింది.  తీన్మార్‌ మల్లన జర్నలిస్టుగా కొందరిలో ఆకర్షణ ఉన్నా  ఓట్ల సమీకరణ, యంత్రాంగం సులభంగా జరిగేవి కావు. మరో జర్నలిస్టు మహిళ కూడా వున్నారు. ఇంటిపార్టీ తరపున ఉన్న చెరుకుసుధాకర్‌కు కొంత స్థానిక పునాది వున్నా పోటీ పెద్ద సవాలుగానే వుంటుంది. ఇంతమంది ఓట్లను  కొద్దికొద్దిగా చీల్చుకోవడం పాలకపార్టీకి బలమైన అభ్యర్థులకు అంతిమంగా ఉపయోగకరం.