మహారాష్ట్ర గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

మహారాష్ట్ర గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ముంబైలోని రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కు గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమవుతారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ముంపు విషయంలో మహారాష్ట్ర సర్కారు తెలంగాణకు పూర్తి సహకారం అందించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం నిర్మాణానికి కేసీఆర్ చొరవ తీసుకొని హరీశ్‌ రావును ముంబై పంపారు. కేసీఆర్ సర్కారు వినతికి సీఎం ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించడంతోనే కాళేశ్వరం సాకారమైంది.