అవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు పూర్తిః మంత్రి

అవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు పూర్తిః మంత్రి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారని తెలిపారు. 5 రోజులుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఐదేళ్లలో జరిగాయన్నారు. నిరంతర విద్యుత్ ఇస్తున్నామని.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావొస్తున్నాయని తలసాని పేర్కొన్నారు.