తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

 తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌, కేయూ వీసీ ఆచార్య ఆర్‌.సాయన్న ఫలితాలను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలో మొత్తం 92.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మల్కాజ్‌గిరికి చెందిన మండవ హనీష్‌సత్య మొదటిర్యాంక్ సాధించగా, నాచారంకు చెందిన సూర్య ఉజ్వల్ నూకల రెండో ర్యాంక్, హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన ప్రద్యుమ్నారెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను గత నెల 23,24 తేదిల్లో 58 పరీక్షా కేంద్రాల్లో ఆన్ లైన్లో ఐసెట్ ను నిర్వహించారు.