తెలంగాణ శాసనసభ సమావేశాలు షురూ..

తెలంగాణ శాసనసభ సమావేశాలు షురూ..

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన 36 రోజుల తర్వాత సభ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశాలు ఆరంభమయ్యాయి. దాదాపు రెండు గంటలపాటు సభ్యుల ప్రమాణస్వీకారాలు ఉంటాయి. 18న స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. శాసనసభ, మండలి బీఏసీల సమావేశాలు కూడా జరుగుతాయి. 19న ఉభయసభల సమావేశంలో గవర్నర్‌ ప్రసంగిస్తారు. 20న శాసనసభ, మండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. ఇక..స్పీకర్‌ ఎంపిక కోసం ఇవాళ ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉంటుంది.