ఈ ఎన్నికలే బీజేపీకి పునాది : లక్ష్మణ్

ఈ ఎన్నికలే బీజేపీకి పునాది : లక్ష్మణ్

 

బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జిల సమావేశం ఈరోజు జరిగింది.  ఇందులో  లక్ష్మణ్, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, జితేందర్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ పాల్గొన్నారు.  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తయారీపై చర్చలు జరిపారు.   ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 'కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది బీజేపీ లోకి చేరేందుకు ముందుకు వస్తున్నారు.  పార్టీకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉంది.  ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలే మనకు పునాది.  కష్టపడి పని చేయాలి.  ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యారు.  సమస్యల పరిస్కారం కోసం ఉద్యోగులకు అండగా మనం ఉండాలి.  జాతీయ పార్టీ నేతలుగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయాల్సి ఉంటుంది.  ఎన్నికలు వాయిదా వేయాలని గవర్నర్ ని కోరాం.  మన ప్రయత్నం మనం చేస్తున్నాం' అన్నారు.