కేసీఆర్‌ మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది..!

కేసీఆర్‌ మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది..!

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభపై సెటైర్లు వేశారు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ బహిరంగ సభ అట్టర్ ప్లాప్‌ అని వ్యాఖ్యానించారు.. సీఎం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు.. మళ్లీ అబద్ధాలు మాట్లాడారని ఆరోపించిన బండి సంజయ్.. మూసి నది ప్రక్షాళన కాదు.. ముందు కేసీఆర్ నోరు ప్రక్షాళన చేయాలి అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ ముఖం, ఆయన మాట్లాడిన మాటలు చూస్తే స్పష్టంగా ఓడి పోతామనే భయం స్పష్టంగా కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు బండి సంజయ్.. భాగ్యనగర్‌లో వరదలు వస్తే పలకరించలేదు.. వారికి భరోసా నింపడానికి మా నేతలు ఢిల్లీ నుండి వస్తున్నారని తెలిపారు బండి.. ఇక, కేటీఆర్‌.. ప్రధాని మోడీ రావాలని అంటున్నారు.. వరదలు వచ్చినప్పుడు మీ అయ్యా ఎక్కడ పడుకున్నాడు అని ప్రశ్నించారు.. భారత్‌ బయోటెక్‌.. నీ ఫామ్‌హౌస్‌ పక్కనే ఉంది.. ఫామ్ హౌస్‌ కి వెళ్లేటప్పుడు ఒక్కసారి అయినా వెళ్లారా? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు బండి సంజయ్.