హిందూ సమాజం బాగుండాలనే... బండి సంజయ్... 

హిందూ సమాజం బాగుండాలనే... బండి సంజయ్... 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.  ఆలయంలో పూజలు నిర్వహించారు.  మహంకాళి దేవాలయం పవిత్రమైన ఆలయం అని, ఈ దేవాలయంలో శక్తి, మహిమ ఉన్నాయని అన్నారు.  నేను నా కుటుంబం అనే స్వార్ధం నుంచి బయటకు రావాలని అన్నారు.  సమాజ హితం కోసమే ఆలోచించాలి అన్నారు.  హిందూ సమాజం నిర్లక్ష్యానికి గురవుతుందని అన్నారు.  హిందూ సమాజం చీలే పరిస్థితి ఉండకూడదని, హిందూ సమాజం బాగుండాలని అమ్మవారిని ప్రార్ధించానని అన్నారు.  భారతీయులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఎవరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని అన్నారు.  స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.