రెచ్చగొట్టింది కేసీఆరే..

రెచ్చగొట్టింది కేసీఆరే..

మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కాకుండా ఇప్పుడు చేసినన్ని కుట్రలు ఇంతకుముందెన్నడూ జరగలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హిందువులు బొందువులు అన్నది కేసీఆరే.. రెచ్చగొట్టింది కేసీఆరే.. మోడీ, అమిత్‌ షాలు అభివృద్ధి అంశాలు గురించి మాత్రమే ప్రచారం చేశారని అన్నారు. కేసీఆర్‌ దగ్గర అభివృద్ధి ఎజెండా లేదు కాబట్టే దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణాలో చాలా మార్పులు ఉంటాయన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

'టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైంది. తెలంగాణాలో రెండు పార్టీల విధానం వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యనే గట్టి పోటీ ఉంటుంది. దక్షిణాదిన సొంతంగా బీజేపీ ఎదగాలని కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడితో పొత్తు పెట్టుకోవడం వల్లనే గతంలో బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. దేశ రాజకీయాల్లో చంద్రబాబు పరిస్థితి ఎడ్లబండిని మోస్తున్న అని అనుకుంటున్న కుక్క పిల్లలాగా ఉంది. ఈ ఎన్నికల్లో పేకాటలో జోకర్‌లాగా మిగిలింది చంద్రబాబు ఒక్కడే. చంద్రబాబు పెట్టిన ప్రతిపక్షాల మీటింగ్‌కి ఎవరూ రాలేదు. చంద్రబాబు రాజకీయాల్లో నిజాయతీ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది' అని లక్ష్మణ్ అన్నారు.