కుటుంబ పార్టీని ఇంటికి పంపటం ఖాయం...

కుటుంబ పార్టీని ఇంటికి పంపటం ఖాయం...

దేశవ్యాప్తంగా అవినీతి, కుటుంబ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు... తెలంగాణలో కుటుంబ అవినీతి పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ను 2019 ఎన్నికల్లో ఇంటికి పంపటం ఖాయం అన్నారు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్... హైదరాబాద్‌ ఉప్పల్‌లో లక్ష్మణ్, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు... ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ముక్తి కోసం దేశం ముందుకు పోతుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓడినా... దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందంటూ టీఆర్ఎస్ సర్కార్‌పై మండిపడ్డారు.