తెలంగాణ బడ్జెట్: కేటాయింపులు ఇలా...

తెలంగాణ బడ్జెట్: కేటాయింపులు ఇలా...

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2019-20 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచారు. ఇక మొత్తం బ్జెట్.. రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, బడ్జెట్ అంచనాల్లో మిగులు, ఆర్థిక లోటు, వివిధ కేటాయింపులు ఇలా ఉన్నాయి..
* రాష్ట్ర బడ్జెట్ రూ.1,46,492.3 కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
* మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు
* బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు 
* ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు
* గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు
* పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు
* ఆరోగ్య శ్రీకి రూ. 1,336 కోట్లు
* రైతుబంధు పథకానికి రూ. 12 వేల కోట్లు
* రైతుబీమా ప్రీమియం చెల్లింపుకు రూ. 1,137 కోట్లు
* ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు
* విద్యుత్ సబ్సిడీలకు రూ.8 వేల కోట్లు
* రైతు రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు