తెలంగాణ బడ్జెట్ రూ.1,46 లక్షల కోట్లు

తెలంగాణ బడ్జెట్ రూ.1,46 లక్షల కోట్లు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.1,46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్... రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు, బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు కాగా.. రాష్ర్ట ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు ఉంటుందని బడ్జెట్ ప్రతిపాదలను సభలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తోంది.. రాష్ట్ర వృద్ధిరేటు 10.5గా నమోదైందని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయ్యింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందన్న ఆయన.. 6.3 శాతం అదనపు వద్ధి రేటు సాధించాం.. వ్యవసాయ రంగంలో 2018-19 నాటికి 8.1 శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది.. ఐదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించాం.. వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు.