తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం: స్థానికులకు అవకాశం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఐటి హబ్ గా మారుతున్నది. కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతున్నది. అయితే, రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలకు కల్పించాలని కేబినెట్ లో నిర్ణయించారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
అంతేకాదు, రాష్ట్రంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెంచాలని, ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని, ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా కేబినెట్ కొత్త సెక్రటేరియట్ భవనాల డిజైన్ కు ఆమోదం తెలిపింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)