కేసీఆర్ ముందస్తు వరాలు...

కేసీఆర్ ముందస్తు వరాలు...

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే అందరూ అనుకున్నట్టు రాజకీయంగా ఆసక్తికరమైన అంశాలేవీ ప్రకటించలేదు. కేవలం తెలంగాణ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలతోనే సరిపెట్టారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలిపారు.

గోపాలమిత్రుల వేతనాన్ని రూ. 3500- రూ. 8500 పెంచారు. అర్చకుల రిటైర్మెంట్ ఏజ్ ను 58-65 ఏళ్లకు పెంచారు. ఆశావర్కర్ల వేతనం 6 వేల -7500 కు పెంచారు. బీసీ కులాల ఆత్మగౌరవ  భవనాల కోసం 71 ఎకరాల భూమిలో.. భవనాల నిర్మాణం కోసం రూ. 71 కోట్లు కేటాయించారు. రెడ్డి హాస్టల్ భవనానికి మరో 5 ఎకరాల భూమిని అదనంగా కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖలో 9 వేల మందికి వేతనాల పెంచుతూ నిర్ణయించారు. సెకండ్ ఏఎన్ఎంలకు ఒక్కొక్కరికి రూ. 21 వేల వేతనం చేశారు. అలాగే కాంట్రాక్టు వైద్యుల వేతనాన్ని రూ. 40 వేలకు పెంచారు.