నిధుల సమీకరణపై తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయం... 

నిధుల సమీకరణపై తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయం... 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగుతున్నది.  మూడు గంటలకు పైగా మారథాన్ కేబినెట్ మీటింగ్ జరిగింది.  ఈ మీటింగ్ లో అనేక విషయాల గురించి చర్చించినట్టు సమాచారం.  ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయ మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు.  రాష్ట్ర ఖజానాకు ఆదాయం ఎలా తీసుకురావాలి అనే విషయాలను ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.  

ప్రస్తుతం భూముల మార్కెట్ విలువ పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.  హెచ్ఎండిఏ పరిధిలోని భూముల అమ్మకలకు కేబినెట్ లైన్ క్లియర్ ఇచ్చింది.  హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములను అమ్మి రూ. 10వేలకోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.  ఉప్పల్ బగాయత్ తరహాలో ల్యాండ్ పూలింగ్ కు వెంచర్లు వేయాలని మీటింగ్ లో చర్చించారు.  అలానే మోకిళ్ల, ప్రతాప సింగారం, మేడ్చల్ జిల్లా కొర్రెములలో వెంచర్లు వేయాలని ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయించినట్టు తెలుస్తోంది.  28న శంషాబాద్ లో రెవిన్యూ సమ్మేళనం నిర్వహించాలని కేబినెట్ లో చర్చకు వచ్చింది.  రెవిన్యూ చట్టంపై అధికారులకు అవగాహన కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.