ఈనెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈనెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుమారు నాలుగు నెలల తరువాత జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ముందు భేటీ జరిగింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, పరిషత్‌ ఎన్నికలు రావడంతో కేబినెట్ సమావేశం కాలేదు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆ అంశంపైనా కీలకంగా చర్చించనున్నారు. ఇటీవల ఆసరా పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని పెంచడంతో పాటు రైతుబంధు నిధుల పెంపు అంశంపైనా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.