రంగనాథుని సేవలో కేసీఆర్..

రంగనాథుని సేవలో కేసీఆర్..

తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించున్నారు. కేసీఆర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్‌కుమార్‌, కేశవరావు, సంతోష్‌కుమార్‌ తదితరులున్నారు. కాగా, ఆదివారం తమిళనాడు పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్... శ్రీరంగం చేరుకున్నారు. కాసేపట్లో శ్రీరంగం నుంచి చెన్నై వెళ్లనున్నారు. చెన్నైలో సాయంత్రం 4.30 గంటలకు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు.  ఫెడరల్ ఫ్రంట్, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించనున్నారు.