మోడీ, జగన్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు..

మోడీ, జగన్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు..

లోకసభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఘనవిజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. మోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు కేసీఆర్. ఇక వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం... రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.