ఢిల్లీ బయల్దేరి వెళ్లిన సీఎం కేసీఆర్

ఢిల్లీ బయల్దేరి వెళ్లిన సీఎం కేసీఆర్

శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకీ బయల్దేరి వెళ్లారు. సీఎంతో పాటు ఎంపీలు వినోద్, సంతోష్.. సీఎస్ ఎస్కె జోషి కూడా వెళ్లారు. మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. 20 రోజుల వ్యవధిలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇది రెండో సారి.