ఉద్యోగులకు ఫిట్‌మెంట్.. ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్..!

ఉద్యోగులకు ఫిట్‌మెంట్.. ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్..!

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫిట్ మెంట్ అంశం ఇంకా ఎటూ తేలలేదు. కానీ, ప్రభుత్వం కనీసం 30 శాతం ఫిట్‌మెంట్​​అందించేందుకు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఫిట్‌మెంట్​ ప్రకటించిన అనంతరం బెనిఫిట్స్ అంశాలపై ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం అవుతారని సమాచారం. ​ఫిట్​మెంట్​ను ఎప్పటి నుంచి అమలు చేస్తారని అంశంపై ఇంకా సర్కార్ తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.