గాంధీ మార్గం ఎప్పటికైనా ఆచరణీయం...

గాంధీ మార్గం ఎప్పటికైనా ఆచరణీయం...

మహాత్మాగాంధీ మార్గం ఎప్పటికైనా ఆచరణీయం, ఆదర్శమార్గంగా నిలుస్తుందని చెప్పారు తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... మంగళవారం మహాత్మాగాంధీ జయంతిని నిర్వహిస్తున్న సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్న కేసీఆర్... శాంతియుత పోరాట పంథా ద్వారా హక్కులు సాధించుకునే మార్గాన్ని బోధించిన మహత్మాగాంధి చిరస్మరణీయుడని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచానికి అహింసా, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు ఆయన అంటూ కొనియాడారు కేసీఆర్.