పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కీలక ఆదేశాలు

పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కీలక ఆదేశాలు

పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో నీరందించాలని అధికారులకు ఆదేశించారు సీఎం కేసీఆర్‌. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతున్నారు సీఎం కేసీఆర్‌. మిగతా సగానికి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే మూడు షిఫ్టుల్లో పనిచేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంపు హౌజులు,కాలువల పనులను సమాంతరంగా చేపట్టాలని చెప్పారు.