కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ చేసి...

కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ చేసి...

కేటుగాళ్లు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావునే వాడుకుని కోట్లు విలువైన భూమిని కొట్టేయాలని ప్లాన్ చేశారు. దీని కోసం సీఎం కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సర్వే నంబర్ 44/పీలో 2 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయమని సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ ఉన్న కాపీని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. రాయదుర్గం ఆర్డీవో ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ లెటర్‌హెడ్‌ను యాకూత్‌పురాకు చెందిన టీఆర్ఎస్ లీడర్ నుంచి రూ.45 వేలకు ప్రధాన నిందితుడిగా ఉన్న మహమ్మద్ ఉస్మాన్ కొనుగోలు చేశారని చెబుతున్నారు పోలీసులు.