మేం కోసుడు మొదలుపెడితే ఉంటావా..? కేసీఆర్ వార్నింగ్..!

మేం కోసుడు మొదలుపెడితే ఉంటావా..? కేసీఆర్ వార్నింగ్..!

ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీలు, నేతలు చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తూ.. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు.. ఇంకా ఏమీలేదు.. ఇవే సమస్యలున్నాయా.. మొన్న ఎన్నికల్లో అదే దందా పెట్టారు.. దుర్మార్గమైన ప్రచారం చేశారు.. అసదుద్దీన్ గడ్డం తీసి నాకు అంటిస్తాడట? గిదేనా పద్ధతి..? ఓ జాతీయ పార్టీ ఎంపీ మాట్లాడే మాటలేనా? (ఎంపీ అరవింద్‌ను ఉద్దేశించి) కనీస మర్యాద లేకుండా ముక్కు కోస్తా అంటూ వ్యాఖ్యానించడం ఏంటి? ఇవేనా భారతీయ జనతా పార్టీ రాజకీయ విలువలు... మరి కోద్దామా? మీ బతుకెంత..? మీ కథెంత..? కోసుడు విధానమే అయితే.. మేం కోస్తే ఉంటావా? నువ్వు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు... ఇంకా కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...