ముగిసిన కేసీఆర్ రెండు రాష్ట్రాల పర్యటన..

ముగిసిన కేసీఆర్ రెండు రాష్ట్రాల పర్యటన..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... తమిళనాడు, కేరళ పర్యటన ముగిసింది. ఇవాళ రాత్రికి ఆయన హైదరాబాద్‌ చేరుకోనున్నారు. కేసీఆర్ గత వారం రోజులుగా కుటుంబంతో కలిసి రెండు రాష్ట్రాల్లో పర్యటించారు. తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను కేసీఆర్ కుటుంబసభ్యులు సందర్శించారు. తమిళనాడు పర్యటనలో ఉన్న కేసీఆర్... రామేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మధురమీనాక్షి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ధనుష్‌కోటి, రామసేతు, పంచముఖి హనుమాన్ ఆలయాలను సందర్శించారు. కాగా, రేపు ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈనెల 14వ తేదీతో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. రేపు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.