శ్రీవారి సేవలో కేసీఆర్..

శ్రీవారి సేవలో కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు... తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి కేసీఆర్.. శ్రీవారి సేవలో పాల్గొన్నారు.  కాగా, తిరుమల పర్యటన కోసం నిన్న సాయంత్రమే తిరుమల చేరుకుంది కేసీఆర్ ఫ్యామిలీ. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్... రెండోసారి తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత... శ్రీవారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.