ఉదయం విజయవాడ.. సాయంత్రం ఢిల్లీకి కేసీఆర్..!

ఉదయం విజయవాడ.. సాయంత్రం ఢిల్లీకి కేసీఆర్..!

ఈ నెల 30వ తేదీన అటు ప్రధానిగా రెండో సారి నరేంద్ర మోడీ... ఇటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరుకానున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... ఎల్లుండి ఉదయం నేరుగా విజయవాడ వెళ్లనున్న సీఎం కేసీఆర్... ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరై.. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. కాగా, ఈ నెల 30వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం జగన్ ప్రమాణస్వీకారం చేయనుండగా... అదేరోజు రాత్రి ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.