నేడు స్టాలిన్‌తో భేటీ..

నేడు స్టాలిన్‌తో భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఇవాళ చెన్నైలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. ఆదివారం తమిళనాడు పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్... శ్రీరంగం చేరుకున్నారు. ఇవాళ శ్రీరంగనాథ స్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్... ఇవాళ మధ్యాహ్నం తర్వాత చెన్నై వెళ్లి సాయంత్రం 4.30 గంటలకు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత తదితర అంశాలపై కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చించనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ వెంట తమిళనాడు పర్యటనకు వెళ్లారు ఎంపీలు వినోద్‌కుమార్‌, కేశవరావు, సంతోష్‌కుమార్‌. తాజాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో పది రోజుల గడువు ఉన్న సమయంలో మరోసారి సమాఖ్య కూటమి ప్రతిపాదనపై సీఎం చర్చలకు తెరలేపారు.