జగన్‌ది ముగిసింది.. ఇక కేసీఆర్ వంతు..!

జగన్‌ది ముగిసింది.. ఇక కేసీఆర్ వంతు..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. హస్తిన పర్యటన ముగిసింది.. మొదట ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తిరిగి అమరావతికి వచ్చిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రవిశంకర్ ప్రసాద్ లాంటివాళ్లను కలిశారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు సిద్ధమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు మంత్రులను కలుస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. ఓ పెళ్లి వేడుకకు హజరై.. హైదరబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సారి హస్తిన టూర్‌లో ప్రధానితో భేటీకి సిద్దమయినట్టు తెలుస్తోంది. 

విభజన హమీలతో పాటు రాష్టానికి సంబందించిన పెండిగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. ఇటు జీఎస్టీ బకాయిల అంశాన్ని కూడా మోడీతో కేసీఆర్ లేవనెత్తే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై విజ్ఞప్తి చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీఏఏను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. అర్ధిక వ్యవస్థ మందగమనంపై కూడా కేంద్రంపై విమర్శలు చేస్తోంది. ఇటు మంత్రి కేటీఆర్ కూడా నిధుల విషయంలో కేంద్రం తీరును తప్పుబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీలో ఏం చర్చిస్తారన్నది ఆసక్తిగా మారింది.