రామగుండంలో సమీక్ష.. కాళేశ్వరం పనుల పరిశీలన..

రామగుండంలో సమీక్ష.. కాళేశ్వరం పనుల పరిశీలన..

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు... ఇవాళ రామగుండం ఎన్టీపీసీలో పర్యటించి... రేపు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. తన రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వెళ్లిన కేసీఆర్... అక్కడ ఎన్టీపీసీని సందర్శిస్తారు. ఆ తర్వాత ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్... ఇక రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్‌లో బస చేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి... ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్‌, మేడిగడ్డ బరాజ్‌ పనులను పరిశీలించనున్నారు.