కాళేశ్వరానికి కేసీఆర్..

కాళేశ్వరానికి కేసీఆర్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరానికి వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఉదయం రామగుండం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహదేవ్‌పూర్ మండలం కన్నేపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం ఆలయానికి వెళ్లి.. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తిరిగి కన్నేపల్లి పంప్‌హౌస్ దగ్గరున్న హెలిప్యాడ్‌కు చేరుకుని  అక్కడి నుంచి మేడిగడ్డ బరాజ్ వెళ్తారు. మధ్యాహ్నం వరకు బరాజ్ దగ్గర కాళేశ్వరం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. గేట్ల బిగింపు, కరకట్టల నిర్మాణం, పనుల పరోగతిపై సాగునీటి శాఖ ఇంజినీర్లతో కేసీఆర్ సమీక్షిస్తారు. తిరిగి రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని.. మధ్యాహ్నం భోజనం తర్వాత హైదరాబాద్‌కు పయనమవుతారు. కాగా, సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.