ఫెడరల్ ఫ్రంట్‌ కోసం త్వరలో ఒడిశాకు కేసీఆర్...

ఫెడరల్ ఫ్రంట్‌ కోసం త్వరలో ఒడిశాకు కేసీఆర్...
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేసిన కేసీఆర్... ఇప్పటికే పలువురు జాతీయ పార్టీల నేతలను కలిశారు. ఇక మే మొదటి వారంలో ఒడిశా వెళ్లనున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు కేసీఆర్. కాగా, కేసీఆర్‌ది ఇది మూడో పర్యటన... ఇప్పటికే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను సంప్రదించారు సీఎం కేసీఆర్... ప్రస్తుతం ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ముగిసిన తర్వాత భేటీ అవుదామని... మే మొదటి వారంలో భువనేశ్వర్‌ రావాల్సిందిగా కేసీఆర్‌ను నవీన్ పట్నాయక్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే మే మొదటివారంలో భేటీ కావడం ఖరారైనా... ఒడిశా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఎప్పుడు సమావేశమయ్యేది ఫైనల్ చేయనున్నారు.