ట్రంప్ కు తెలంగాణ ముఖ్యమంత్రి స్పెషల్ గిఫ్ట్... ఏంటో తెలుసా?

ట్రంప్ కు తెలంగాణ ముఖ్యమంత్రి స్పెషల్ గిఫ్ట్... ఏంటో తెలుసా?

రేపు ట్రంప్ ఇండియాకు వస్తున్న సంగతి తెలిసందే.  రేపు అహ్మదాబాద్ చేరుకున్న తరువాత ట్రంప్ అక్కడ మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ సభ ఉంటుంది.  ఇక ఫిబ్రవరి 25 వ తేదీన రాష్ట్రపతి భవన్లో విందు ఉంటుంది.  ఈ విందులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.  రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు.  

అయితే, ఈ విందు అనంతరం ట్రంప్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.  అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని రుచులను ట్రంప్ కు పరిచయం చేయబోతున్నారు. ట్రంప్ కోసం స్పెషల్ గా నాటుకోడి పకోడీని తయారు చేయిస్తున్నారట.  దానిని స్పెషల్ గిఫ్ట్ గా ప్యాక్ చేయించి ట్రంప్ కు రుచి చూపించబోతున్నారు.  దీంతో పాటుగా తెలంగాణలో బాగా ఫేమస్ అయిన మరికొన్ని వంటలను కూడా ట్రంప్ కు పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.  దేశంలోని వివిధ రాష్ట్రాలను అతి కొద్దిమంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఈ విందుకు ఆహ్వానం వచ్చింది.  అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉండటం విశేషం.