ఆందోళన చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా?

ఆందోళన చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా?

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా మండిపడ్డారు. టీఆర్ఎస్ కు పూర్తి మద్దతు ఉన్నా.. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పీసీసీ, సీఎల్పీ నేతలు ఫిర్యాదు చేసిన స్పీకర్ పట్టించుకోలేదని అన్నారు. చివరికి గవర్నర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ డిక్టేటర్ షిప్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు.

'ఎమ్మెల్యేలు ఏ పార్టీలోనైనా చేరవచ్చు... అది వాళ్ల ఇష్టం. కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలో చేరితే ఇబ్బంది లేదు. 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి టీఆర్ఎస్ లో చేరారనేది అవాస్తవం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ప్రలోభాలకు గురిచేసి, మరికొందరిని బెదిరించి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. దళిత నాయకుడు సీఎల్పీ లీడర్ గా ఉండటం కేసీఆర్‌కు ఇష్టం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా దళిత నేతను కేసీఆర్ చూడలేకపోతున్నారు' అని కుంతియా అన్నారు.