రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.53 వేల రుణభారం...

రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.53 వేల రుణభారం...

మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... రూ. 2 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ... ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై రూ.53 వేల భారం పడుతోందని వెల్లడించారు. ముస్లింలకు 4 శాతం నుంచి రిజర్వేషన్ ను 12 శాతం చేస్తానని మోసం చేశారని మండిపడ్డ షబ్బీర్ అలీ... రిజర్వేషన్లపై అసెంబ్లీలలో నిలదీస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారని విమర్శించారు.

మోసగాళ్లకే మోసగాడు సీఎం కేసీఆర్ అన్నారు షబ్బీర్ అలీ... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డ ఆయన... వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం... అవినీతికి పాల్పడ్డ అధికారులు, నేతలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పేదవారికి ఒక్క డబుల్ బేడ్ రూమ్ ఇల్లు రాకున్నా... టీఆర్ఎస్ నేతలు మాత్రం పెద్దపెద్ద ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించిన షబ్బీర్... ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు మా మద్దతు ఉంటుందని... ప్రభుత్వం వారి సమ్మెను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు.