వీహెచ్ హౌస్ అరెస్ట్...

వీహెచ్ హౌస్ అరెస్ట్...

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్‌)ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు... తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలకు పిలుపునివ్వగా... దీంతో విపక్ష నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీహెచ్‌‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా, పాత సచివాలయంలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అనంతరం ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.