మాధురి దీక్షిత్‌తో అమిత్‌షా భేటీయే దానికి నిదర్శనం...

మాధురి దీక్షిత్‌తో అమిత్‌షా భేటీయే దానికి నిదర్శనం...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... మాధురి దీక్షిత్ దగ్గరకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే... అదే ఆయన గ్రాఫ్ పడిపోయిందని అని చెప్పడానికి నిదర్శనం అన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు... ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్లు నామాటే వేదవాక్కు అన్నారు... కానీ, రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రవర్తనలో మార్పు వచ్చినట్టుందన్నారు వీహెచ్. ఇక ప్రధాని మోడీని మావోయిస్టు చంపే కుట్ర జరుగుతోందన్నది వాస్తవమే..? కాదో? తేల్చాలని డిమాండ్ చేశారు. పోతున్న ఇమేజ్‌ పెంచుకోవడానికే కుట్ర జరుగుతోందని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించిన వీహెచ్... నిజాలు నిగ్గుతేల్చేందుకు కేంద్రం విచారణ జరపాలన్నారు.

ఇక సీఎం కేసీఆర్‌ చేసేది మొత్తం ఓట్ల రాజకీయమేనని ఆరోపించారు వీహెచ్... చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సరైంది కాదని... ఆర్టీసీ సమ్మెకి కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు. అజ్మీర్ లో భవనం కట్టండి... మరి శబరిమలలో కట్టిస్తానన్న భవనం ఏమైంది? అని ప్రశ్నించారు వీహెచ్. రైతులకు ఇచ్చే నాలుగు వేలు కూడా ఎన్నికల కోసమేనంటూ ఆరోపించిన కాంగ్రెస్ సీనియర్ నేత... రైతు బంధు అంతా... బడా బాబులకు మాత్రమే ఉపయోగం అంటూ విమర్శలు గుప్పించారు.