క్రికెట్ స్టేడియం పేరుతో దందా చేస్తున్నారు...

క్రికెట్ స్టేడియం పేరుతో దందా చేస్తున్నారు...

ఉప్పల్ క్రికెట్ స్టేడియం పేరుతో టీఆర్ఎస్ నేత వివేక్ దందా చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు... వివేక్ సోదరులే క్రికెట్ లో రాజకీయం చేస్తున్నారని విమర్శించిన ఆయన... క్రికెట్ అభివృద్ధి కోసం, క్రీడాకారులకు న్యాయం కోసమే నా పోరాటం అని స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి సహాయం కోసం అప్పట్టో కొంతమంది నా దగ్గరకు వచ్చారని... సోనియాగాంధీని కలిసి సహాయానికి ఒప్పించానని గుర్తుచేసుకున్న వీహెచ్... వీహెచ్ పెత్తనం చేలాయిస్తాడని భావించి తర్వాత వారు మనసు మార్చుకున్నారని... విశాఖ ఇండస్ట్రీతో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. రూ. 6 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు... కానీ, రూ.4.30 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించిన వీహెచ్... అయినా వివేక్ సోదరులు ప్రకటనలు, టికెట్ల రూపంలో ఇప్పటికే రూ. 20 కోట్లు సంపాదించారన్నారు. అసలు లైఫ్ లాంగ్ ఒప్పందం ఎలా? కుదుర్చుకుంటారని ప్రశ్నించారు వీహెచ్.