కేటీఆర్‌ను సీఎంని చేసేందుకే ముందస్తు...

కేటీఆర్‌ను సీఎంని చేసేందుకే ముందస్తు...

ముందస్తు ఎన్నికలు అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎందుకు హడావుడి చేస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు... ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... కొడుకు (కేటీఆర్‌)ను ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని... ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనతో ప్రజల్లో, యువతలో వచ్చిన మార్పు చాలా క్లియర్ గా కనిపిస్తోందన్న వీహెచ్... టీఆర్ఎస్ నేతలు చాలా మంది ఎందుకు టీఆర్ఎస్‌లోకి వెళ్లామా? అని బాధపడుతున్నారన్నారు. 

అది జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా...
ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది వస్తారు అని అంటున్నారన్న వీహెచ్... అయితే 25 లక్షల మంది ప్రజలు టిఆర్‌ఎస్ సభకు వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ప్రజలకు తెలిసిపోయింది టీఆర్ఎస్‌ది కుటుంబం పాలనఅని పేర్కొన్న వీహెచ్... కేబినెట్‌లో బీసీలు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. కులసంఘాలను కేసీఆర్ ఉపయోగిచుకుంటున్నారని ఆరోపించిన మాజీ ఎంపీ... ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారు ఎవరూ గెలవలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు వీహెచ్.