సండ్రా, పువ్వాడపై లోక్ పాల్ లో ఫిర్యాదు

సండ్రా, పువ్వాడపై లోక్ పాల్ లో ఫిర్యాదు

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పువ్వాడ అజయ్‌లపై లోక్‌పాల్‌లో ఫిర్యాదు నమోదు అయింది. రాజకీయ అవినీతికి పాల్పడ్డారని, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరీదైన ప్రభుత్వ స్థలాలను జీవో నెం.5 ద్వారా తక్కువ ధరకు కట్టబెట్టారని తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్ తన ఫిర్యాదులో పేర్కొన‍్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు రాజకీయ అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్‌, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్‌లోకి లాక్కున్నారని ఆరోపించారు. రాజకీయ అవినీతికి పాల్పడిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీలోకి విలీనానికి సంతకం పెట్టిన మొత్తం 11మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లు మానవతా రాయ్‌ తెలిపారు.