ఫిరాయింపులపై కొత్త గవర్నర్‌కు ఫిర్యాదు

ఫిరాయింపులపై కొత్త గవర్నర్‌కు ఫిర్యాదు

ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొత్త గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.. పార్టీ మారిన నేతలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. గత గవర్నర్ పార్టీ ఫిరాయించిన తలసానితో మంత్రిగా ప్రమాణం చేయించారని, అప్పట్నుంచీ ఫిరాయింపులకు ప్రోత్సాహం లభించిందని భట్టి చెప్పారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్‌లోకి 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని ఫిర్యాదు చేశారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులపై కోర్టులో కేసు నడుస్తుండగానే.. సబితా ఇంద్రారెడ్డికి పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజ్యాంగానికి సేఫ్ గార్డ్‌గా ఉంటానని హామీ ఇచ్చారని చెప్పారు భట్టి.