సీఎల్పీ విలీనంపై హైకోర్టులో పిటిషన్..

సీఎల్పీ విలీనంపై హైకోర్టులో పిటిషన్..

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు టీఆర్ఎస్‌లో చేరడం.. సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ ఇవ్వడం.. ఆ తర్వాత సీఎల్పీని విలీనం చేయడం జరిగిపోయాయి. అయితే, సీఎల్పీ విలీనంపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.. నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందిరాపార్క్ దగ్గర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దీక్షకు కూడా దిగారు. మరోవైపు దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ పిటిషన్‌ను విచారించాలని కోర్టును కోరారు పిటిషనర్ల తరపున న్యాయవాది జంధ్యాల రవి శంకర్.. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.