సచివాలయం, అసెంబ్లీని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

సచివాలయం, అసెంబ్లీని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ సచివాలయాన్ని పరిశీలించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు... అసెంబ్లీ భవనాలతో పాటు సచివాలయంలోని భవనాలను పరిశీలించింది కాంగ్రెస్ నేతల బృందం... దీంతో ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, ఎమ్మెల్యే సీతక్క పలువురు కాంగ్రెస్ నేతలు సచివాలయాన్ని పరిశీలించనవారిలో ఉన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసేందుకే ప్రభుత్వం కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ పూనుకున్నారని ఆరోపించారు. వాస్తు, వారసత్వ రీత్యే పాత భవనాలను కూలుస్తున్నారని సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేతలు. కొత్త భవనాల నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు.. కానీ, అన్ని హంగులున్న నిర్మాణాలను కూల్చివేసి.. కొత్తవి కట్టాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క... దీనికి కంటే ప్రాధాన్యత కలిగిన అంశాలు చాలా ఉన్నాయన్నారు.