తెలంగాణాలో స్థిరంగా కేసులు.. ఈరోజు ఎన్నంటే ?

తెలంగాణాలో స్థిరంగా కేసులు.. ఈరోజు ఎన్నంటే ?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఆరోగ్య శాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,214 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,93,600కి చేరింది.  ఇందులో 1,63,407 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 29,058 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1135కి చేరింది.  భద్రాద్రి కొత్తగూడెం లో 99, జీహెచ్ఎంసిలో 305, కరీంనగర్ లో 106, మేడ్చల్ లో 153, నల్గొండలో 149, రంగారెడ్డిలో 191, వరంగల్ అర్బన్ లో 131 కేసులు కాస్త ఎక్కువగా నమోదయ్యాయి.