తెలంగాణలో తగ్గని కరోనా జోరు.. మళ్లీ పెరిగిన కేసులు
తెలంగాణలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 176 పాజిటివ్ కేసులు నమోదవగా...ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 163 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,807 కు చేరుకోగా.. 2,95,222 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1,634 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.80 శాతంగా ఉందని.. ప్రస్తుతం 1,951 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 859 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 40,985 శాంపిల్స్ టెస్ట్ చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 87,00,651 కు చేరిందని బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)