తెలంగాణ కరోనా అప్‌డేట్‌.. ఈరోజు ఎన్నికేసులంటే..?

తెలంగాణ కరోనా అప్‌డేట్‌.. ఈరోజు ఎన్నికేసులంటే..?

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 394 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,640కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1571కు పెరిగింది.. ఇక, 2,84,611 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,458 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. వాటిలో 2461 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మరోవైపు.. మంగళవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 38,192 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 73,50,644కు చేరింది. తాజా కేసుల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 61 కేసులు నమోదు అయ్యాయి.