తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్‌..

తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్‌..

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా ఉంది... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 221 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి... మరో ఇద్దరు కరోనాతో మృతిచెందగా... కరోనాబారినపడిన 431 మంది బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,93,056కు చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 2,87,899కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు కరోనాబారిన పడి మృతిచెందినవారి సంఖ్య 1588కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 96.8 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.24 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,569 యాక్టివ్‌ కేసులు ఉండగా... అందులో 1,973 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 30,005 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 76,32,980కు పెరిగిందని చెబుతోంది సర్కార్. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 36 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.