డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్స్ వాయిదా...

డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్స్ వాయిదా...

తెలంగాణాలో  కరోనా లాక్ డౌన్ లో భాగంగా అన్ని విద్యా సంస్థలు మూసేయడం జరిగింది. పరీక్షలు జరిపేందుకు అవకాశం లేకపోవడంతో 10 వ తరగతి విద్యార్థులను బోర్డు పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా పై తరగతులకు ప్రమోట్ చేసారు. అయితే లాక్ డౌన్ కంటే ముందే ఇంటర్మీడియెట్ విద్యార్థుల పరీక్షలు ముగిసిపోయాయి. ఈ మధ్యే వారి పరీక్షా ఫలితాలను కూడా విడుదల చేసారు అధికారులు. ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల కోసం జులై 1 అంటే ఈ రోజు నుండి డిగ్రీ ఆన్‌ లైన్ అడ్మిషన్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో  ఈ రోజు నుండి ప్రారంభం కావాల్సిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ను 15 రోజులు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు సంబంధిత అధికారులు. కరోనా తాజా పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆన్ ‌లైన్ అడ్మిషన్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభించనున్నారు అనే విషయాన్ని తెలుపలేదు.