ముఖ కవళికలతో నేరస్తుల గుర్తింపు: డీజీపీ

ముఖ కవళికలతో నేరస్తుల గుర్తింపు: డీజీపీ

క్రిమినల్ కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇంతకుముందు వేలిముద్రలు, డీఎన్‌ఏ సహకారంతో దర్యాప్తు సాగేదని, ప్రస్తుతం ముఖ కవళికల ద్వారా కూడా సాంకేతికతతో నేరస్తులను గుర్తించే అవకాశం ఉందన్నారు. నేరస్తులు జనంలో కలిసిపోయినా కూడా గుర్తించొచ్చని డీజీపీ తెలిపారు. ఈ ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని టీఎస్‌కాప్‌కు అనుసంధానం చేసి పోలీసు అధికారులకు అందించామని మహేందర్‌రెడ్డి తెలిపారు. సమాచార నిధి ఏర్పాటు చేసి నేరస్తులను సులభంగా గుర్తించే సౌలభ్యం ఈ టెక్నాలజీతో సాధ్యమవుతుందని డీజీపీ స్పష్టం చేశారు. అనుమానితులు, నిందితుల గుర్తింపు కోసమే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని డీజీపీ తెలిపారు.