కరోనా అలెర్ట్ : లక్షణాలు లేకుండానే, నిర్ధారణ అవుతోంది జాగ్రత్త !

కరోనా అలెర్ట్ : లక్షణాలు లేకుండానే, నిర్ధారణ అవుతోంది జాగ్రత్త !

దీర్ఘకాలిక సెలవు పై డిహెచ్ అంటూ దుష్ప్రచారం జరుగుతోంది. అయితే డిహెచ్ శ్రీనివాస్ రావు మాత్రం తన రెగ్యులర్ డ్యూటీ లకు హజరవుతున్నారు. ఇక తాజాగా కరోనా సెకండ్ వేవ్ అడ్డుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణా  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇప్పుడు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా నిర్ధారణ అవుతోందన్న ఆయన ముందస్తుగా కరోనా ను గుర్తించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 1096 కోవిడ్ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. చలి కాలంలో, ఫ్లూ, స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా లు పెరిగే అవకాశం ఉంది.. కోవిడ్ లక్షణాలు గుర్తించడంతో పాటు,  సీజనల్ వ్యాధుల పై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.